Aditya Hrudayam | ఆదిత్య హృదయం Telugu PDF

Download Aditya Hrudayam Telugu PDF

You can download the Aditya Hrudayam Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File nameAditya Hrudayam Telugu PDF
No. of Pages13  
File size1.3 MB  
Date AddedAug 25, 2022  
CategoryReligion  
LanguageTelugu  
Source/CreditsDrive Files        

Aditya Hrudayam Overview

It is a devotional and powerful hymn dedicated to Lord Surya also known as Aditya. Aditya’s heart is one of the most influential hymns ever discovered. It is also described in Yuddha Kanda (6.105) of Valmiki Ramayana. Many of you want to download Aditya Hrudayam Meaning in Telugu Pdf but this is one of the most beautiful Pdf you will find. Agastya recited the lyrics of this Aditya Hrudayam Stotram to Lord Rama. If you are looking for Aditya Hrudayam Stotram Sahitya in Telugu Pdf then it is the right place.

Aditya Hrudayam Telugu PDF with Meaning :

తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం !

రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం !!

యుద్ధము చేసిచేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమారరంగమున చింతాక్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.  

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభాగ్యతో రణం !  

ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః !!

 యుద్దమును చూచూటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.

రామ రాం మహాబాహో శృణు గుహ్యం సనాతనం !

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్వసి !!

ఓ రామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం !

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం !!

ఈ ఆదిత్యహృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను ఆక్షయముగా ప్రసాదించునది.  

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం !  

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థనముత్తమం !!

ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆధివ్యాధులను తొలగించి ఆయుష్షును వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము.  

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం !  

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం !!

అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, స్వమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.  

సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః !  

ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః !!

యితడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజోరాశి, తన కిరణములచే లొకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.  

ఏష బ్రహ్మా చ విష్ణశ్చ శివః స్కందః ప్రజాపతిః !

 మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః !!

బ్రహ్మ విష్ణువు, శివుడు, క్మారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు, మరియు  

పితరో పసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః !  

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః !!

పితృదేవతలు.వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నియు ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ !  

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః !!

ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ యిచ్చును. లికోపకారం కొరకు  ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగ ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.  

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ !  

తిమిరోన్మథనః  శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ !!

శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములుగలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు, తేజో విధానములైన కిరణములుగలవాడు. చీకట్లను పారద్రోలువాడు, సుఖములను గూర్చువాడు, సర్వసంహారకుడు, జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు.  

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః !  

అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః !!

బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు, తాపత్రయములతో భాదపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తరింపజేయువాడు, దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు, ఆదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగ శాంతించువాడు, మంచును తొలగించువాడు.  

వ్యోమనాథస్తమోఖేదీ ఋగ్యజుస్సామపారగః !  

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః !!

ఆకాశమునకు అధిపతియైనవాడు రాహువును ఛే దించు లక్షణముగలవాడు, పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించుచుండువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.

అతీప మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః !  

కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవ !!

వేడిని కలిగియుండువాడు, వృత్తాకారమైన బింబము గలవాడు, విరోధులను రూపుమాపుతాడు. ప్రభాతసమయమున పింగళవర్ణము కైగియుండువాడు, మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగియుండు వాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.

 నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః !  

 తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే !!

నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు, విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తెజస్సులకు మించిన తేజస్సు గలవాడు, పన్నెండు రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః !  

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః !!

స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.

జయాయ జయభద్రాయ హర్యశ్యాయ నమో నమః !  

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః !!

జయములను, శుభములను చేకూర్చువాడవు, శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు, వేళా కొలది కిరణములు గలవాడవు, అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.  

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః !  

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః !!

నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు, ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింప చేయువాడవు, జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.  

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే !  

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః !!

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు, కాంతికి నిధియైన వాడవు, ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.  

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా యామితాత్మనే !  

క్రుతఘ్న ఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః !!

తమస్సును రూపుమాపువాడవు, జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు నిన్ను ఆశ్రయించినవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు, కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, సమస్త జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.

తప్తాచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే !  

సమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే !!

బంగారమువంటి వన్నెగలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వజగత్కర్తవు, తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశస్వరూపుడవు, జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.

నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభుః !  

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః !!

రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. యితడు తన కిరణములచేత జగత్తు తపింపజేయును. వర్శములను ప్రసాదించుచుండును   

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః !   

ఏష ఏవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం !!

యితడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నాను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపమూ    ఇతడే తత్ఫలస్వరూపమూ ఇతడే.  

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతునాం ఫలమెవ చ !  

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః !!

యితడు వేదవేద్యుడు, యజ్ఞఫలస్వరూపుడు, లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.  

ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషు భయేషు చ !  

కీర్తియన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః !!

రఘురామా! ఆపదలయందును, కష్టములయందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండడు.  

పూజాయ స్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతం !  

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి !!

దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామమునండు విజయము పొందగలవు.

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి !  

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం !!

మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.  

ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా !  

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ !!

మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్యహృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను.  

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ !  

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ !!

పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని చూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట అ రఘువీరుడు తన ధనువును చేబూనెను.

 రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ !

 సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్ !!

మిగుల సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.  

అథ రవిరవదన్ని రీక్ష్య ముదితమనాః పరమం ప్రహ్యష్యమాణః !  

నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి !!

పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరామునిజూచి రామా! త్వరపడుము అని పలికెను.

Benefits:

  1. After getting up in brahma muhurtham, take bath, wear clean clothes, take water in a copper pot, put roli or sandalwood and flowers and offer it to Surya.
  2. While offering water to Surya, chant Gayatri Mantra and recite Aditya Hridaya Stotra before Sun God.
  3. If this verse is performed on any Sunday of Shukla Paksha, it is good.
  4. If you want to get the full result of this lesson, it should be recited daily at sunrise.
  5. After the recitation, while meditating on Lord Surya, bow to him.
  6. If you can’t read every day, you can do it every Sunday.
  7. Do not consume non-vegetarian food, alcohol and oil on Sunday while reciting Aditya Hridaya Stotra. If possible, don’t even eat salt on Sunday.
Aditya Hrudayam Telugu PDF

Aditya Hrudayam Telugu PDF Download Link

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.